
స్వచ్ఛాంధ్ర–2025 అవార్డుల ప్రదానం
● మొత్తం 48 మందికి అవార్డులు
విజయనగరం అర్బన్: ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర–2025 జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను ప్రదానం చేశారు. జిల్లా స్థాయిలోని 15 విభాగాలకు చెందిన 48 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి, మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, విజయనగరం, రాజాం, నెల్లిమర్ల మున్సిపల్ చైర్మన్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.