
విజయనగరం
పుష్ప ప్రదర్శన
న్యూస్‌రీల్
ప్రారంభమైన విజయనగర ఉత్సవాలు
11 వేదికల్లో ఆకట్టుకున్న కార్యక్రమాలు
ఉత్సవ ర్యాలీని ప్రారంభించిన
మంత్రులు అనిత, శ్రీనివాస్
సోమవారంతో ముగియనున్న
ఉత్సవాలు
సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
పైడతల్లి సిరిమానోత్సవానికి వచ్చే భక్తుల
సౌకర్యార్థం వాహనాలను నిర్దేశించిన
ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలని
ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. –8లో
విజయనగరం ఫోర్ట్: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక మాన్సాస్ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పుష్పాలను ఆసక్తిగా తిలకించారు. పలు రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా పుష్పాలతో ఏర్పాటు చేసిన తంబుర, వయోలిన్, గంటస్థంభం, సీతాకోక చిలుక, కూరగాయలతో తయారు చేసిన మొసలి, డ్రాగన్, సైకత పైడితల్లి ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె.చిట్టిబాబు, డీఆర్‌డీఏ పి.డి. శ్రీనివాసరావు, ఏపీడీ సావిత్రి, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
జానపద కళలతో కనువిందు చేస్తూ, కళా రూ పాలతో మైమరిపింపజేస్తూ, విచిత్ర వేషధారణల తో ఆకట్టుకుంటూ విజయనగర ఉత్సవ శోభాయా త్ర శోభాయమానంగా జరిగింది. విజయనగర ఉత్సవాల ప్రారంభానికి సంకేతంగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం ఉదయం మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కోట వద్ద ప్రముఖులు ఆసీనులై కళా రూపాలను తిలకించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిధి గజపతిరాజు కళాకారులతో కలిసి థింసా నృత్యం చేశారు.
శోభాయమానంగా శోభాయాత్ర
ర్యాలీలో స్వాగత శకటం, రోలర్ స్కేటర్స్ విన్యాసాలతో, పైడితల్లి అమ్మవారి కలశాలతో మహిళలు, తప్పెటగుళ్లు, థింసా నృత్యం, పులి వేషాలు, విచిత్ర వేషాలు, ఆగమ పండితుల బృందం, విజయనగ రం వైభవం, కేరళ వాయిద్యాలు, కర్ర సాము, అడుగుల బొమ్మలు, కొమ్మ కోయ డ్యాన్స్, బిందెల డ్యా న్స్, చెక్క భజన, గంగిరెద్దులు, జముకుల బృందం, కాళీమాత డ్యాన్స్, ఎన్సీసీ కేడేట్స్ మార్చ్, కోలాటం, క్రీడా సంఘాలు మరియు క్రీడాకారులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్, ఎస్.హెచ్.జి.గ్రూపులు తదితర బృందాలు అలరించాయి.
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి
ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే పూసపా టి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరా వు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాల ను కాపాడుకొనేందుకు ఇటువంటి పండుగలు దోహదం చేస్తాయనున్నారు. నేటి తరానికి సంప్రదాయాలు, కళలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. జానపద కళలను, కళాకారులను ఆదుకునేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో అవసరమ ని అన్నారు. పైడితల్లి అమ్మవారు జిల్లా ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు.
11 వేదికల్లో ఆకట్టుకున్న వివిద కార్యక్రమాలు
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయనగరం ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఉత్సవాల్లో భాగంగా 11 వేదికల్లో వివిధ రకాల కార్యక్రమాల ను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఆదివారం అతిథులు చేతుల మీదుగా ప్రా రంభించారు. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోగా... మాన్సాస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలు చూపరులకు కనువిందు చేశాయి. బొంకుల దిబ్బపై పౌరాణిక నాటకాలు ప్రదర్శించగా, గురజాడ కళా క్షేత్రంలో స్థానిక కళాకారులు ప్రదర్శించిన నాటకాలు అలరించాయి. లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో జానపద కళా రూపా లు ప్రదర్శన విజయనగరం సంస్కృతిని ప్రతిబింబించగా.. అయోధ్య మైదానంలో నిర్వహించిన పెట్ షో అందరినీ ఆకట్టుకుంది. రెండవ రోజైన సోమవారం ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ అయోధ్య మైదానంలో ప్రముఖ సింగర్స్‌తో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయనున్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మార్క్‌ఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగారురాజు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, జేసీ ఎస్.సేతుమాధవన్ తదితర ప్రముఖులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
కోటలో చిన్నారుల నృత్య రూపకం

విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం

విజయనగరం