
అలరించిన పెట్ షో
విజయనగరంఫోర్ట్: విజయనగర ఉత్సవాల్లో భాగంగా స్థానిక అయోధ్య మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన పెట్ షో అకట్టుకుంది. పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో పెట్ షో నిర్వహించారు. సిజ్జు, జెర్మనీ పెషర్డ్, ల్యాబ్, కొమిరేనియా, డాబర్ మెన్ తదితర 20 రకాలకు చెందిన 195 పెట్స్ (పెంపుడు కుక్కలు) షోలో పాల్గొన్నాయి. పెట్‌షోలో పాల్గొనేందుకు 170 మంది ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోగా, 25 మంది స్పాట్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. పెట్‌లో షోలో పుంగనూరు జాతి ఆవులు, విదేశీ పావురాలు, గీనీపిక్స్, లవ్‌బర్డ్స్, రాబిట్స్ , పావురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. షోలో పాల్గొన్న పెట్స్ యాజమానులకు జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ మురళీకృష్ణ సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జి.మహాలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్స్ డాక్టర్ కేవీ.రమణ, డాక్టర్ టి. ధర్మారావు, డాక్టర్ ఎల్, విష్ణు, డాక్టర్ ఆర్.శారద, డాక్టర్ పి.అనూరాధ, వీఏఎస్‌ల డాక్టర్ టి.మోహన్ రావు, డాక్టర్ ఎన్.జి.సాగర్, డాక్టర్ వి. భావన, డాక్టర్ ఎ.భాగ్య రాజ్, డాక్టర్ ఎల్.శ్రుతి పాల్గొన్నారు.