
ఆర్చరీలో మెరిసిన అక్కాచెల్లెళ్లు
● రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌కు ఎంపిక
సీతంపేట: ఎస్‌జీఎఫ్ క్రీడల్లో ఆర్చరీ రాష్ట్రస్థాయి పోటీలకు స్థానిక హిమరక ప్రసాదరావు కుమార్తెలు ఎంపికయ్యారు. ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో సీతంపేట మండలం నుంచి అక్కాచెల్లెళ్లు హాజరు కాగా అండర్ 19లో హెచ్.సంయుక్త, అండర్ 17లో హెచ్.లక్షితలు ఎంపిక కావడం పట్ల ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, ఐటీడీఏ స్పోర్ట్స్ ఇన్‌చార్జ్ జాకాబ్ దయానంద్, కోచ్ మధులతో పాటు పలువురు అభినందించారు.
ప్రారంభమైన క్రీడోత్సవం
విజయనగరం: విజయనగర ఉత్సవాల్లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన క్రీడోత్సవం ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా మొత్తం ఏడు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనుండగా స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ క్రీడాంశాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పురుష జట్లకు మాత్రమే పోటీలు నిర్వహించగా..టెన్నిస్ క్రీడాంశంలో ఉత్తరాంధ్ర స్థాయిలో పోటీలు నిర్వహించారు. చెస్ క్రీడాంశంలో 15 సంవత్సరాల లోపు వయస్సు గల బాల,బాలికలకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 800 మంది క్రీడాకారులు పాల్గొనగా..ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో పోటీలు జరిగాయి. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సోమవారం సాయంత్రం బహుమతీ ప్రదానోత్సవం చేయనున్నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి కె.శ్రీధర్‌రరావు తెలిపారు. పోటీలను ఆయా క్రీడా అసోసియేషన్‌ల ప్రతినిధులు కె.జ్వాలాముఖి, కేవీఎన్ చిన్నారి, కేవీ.ప్రభావతి, వై.కుసుంబచ్చన్, నున్న సురేష్ తదితరులు పర్యవేక్షించారు.
అలరించిన థింసా నృత్య ప్రదర్శన
విజయనగరం టౌన్: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో పలువురు చిన్నారులు ఆదివారం చేసిన థింసా నృత్య ప్రదర్శన చూపరులను అలరించింది. అలాగే బాలభవన్, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం కళాకారుల బృందాలు చేసిన జానపద కళా ప్రదర్శనలు సైతం ఆకట్టుకున్నాయి.

ఆర్చరీలో మెరిసిన అక్కాచెల్లెళ్లు

ఆర్చరీలో మెరిసిన అక్కాచెల్లెళ్లు