
కొట్టక్కి ఉన్నత పాఠశాలకు పురస్కారం
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి ఉన్నత పాఠశాలకు అరుదైన పురస్కారం లభించింది.గత ప్రభుత్వంలో నాడు నేడు కింద కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మించిన అదనపు తరగతి గదులతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు పరిశుభ్రత, పచ్చదనం,పర్యావరణ పరిరక్షణలో చేసిన కృషికి గుర్తింపు లభించింది. స్వర్ణాంఽధ్ర–స్వచ్ఛాంధ్ర–2025 జిల్లాస్థాయిలో ప్రభుత్వం పాఠశాలల విభాగంలో మొదటి స్థానం దక్కించుకుంది.ఈ నెల 6వ తేదీన జిల్లా కేంద్రంలో కలెక్టర్ చేతుల మీదుగా సంబంధిత హెచ్‌ఎం అవార్డు అందుకోనున్నారు.
సంతోషంగాఉంది..
మా పాఠశాల స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కింద పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఇది మా పాఠశాల సాధించిన ఘనత. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది. – ఆమిటి శ్రీనివాసరావు,
హెచ్‌ఎం ఉన్నత పాఠశాల కొట్టక్కి