
ఏర్పాట్ల పరిశీలన
తగరపువలస: పెద్దిపాలెంలోని చెన్నా ఫంక్షన్‌హాలులో ఆదివారం జరిగే వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లను శనివారం విశాఖ, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమరనాథ్, పార్టమెంట్ ప్రధాన కార్యదర్శి తైనాల విజయకుమార్, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పరిశీలించారు. జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావు, ఎంపీపీ దంతులూరి వాసురాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గండ్రెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బంక సత్యం, మజ్జి వెంకటరావు, షిణగం దామోదరరావు, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు షిణగం రాంబాబు, రౌతు శ్రీను తదితరులు పాల్గొన్నారు.