
జూ పార్కుకు కొత్త అందాలు
‘డక్ ఏవరీ’లో అలరిస్తున్న బాతులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో బాతులు సందర్శకులను అలరిస్తున్నాయి. జూ అధికారులు ఇటీవల ఈ బాతులను ఇతర జూ పార్కుల నుంచి మొదటిసారిగా ఇక్కడికి తీసుకువచ్చారు. ఇంతవరకు ఇక్కడ బాతుల జాతి అందుబాటులో లేదు. వీటి కోసం లవ్ బర్డ్స్ జోన్ పక్కన ప్రత్యేకంగా ‘డక్ ఏవరీ’ నిర్మించారు. ఈ ఏవరీలో తెలుపు, బూడిద రంగు, నలుపు–నీలం కలిసిన రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే బాతులను విడిచిపెట్టారు. కొద్ది రోజులుగా ఈ బాతులు సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. ఏవరీ లోపల వాటి కోసం ఏర్పాటు చేసిన చిన్న కొలనులో ఈత కొడుతూ, పచ్చని పచ్చికపై హుషారుగా తిరుగుతూ సందడి చేస్తున్నాయి. యానిమల్ కీపర్లు అందించే గింజలు, పండ్ల ముక్కలను తింటూ ఆకట్టుకుంటున్నాయి.

జూ పార్కుకు కొత్త అందాలు