డాబాగార్డెన్స్ : నగరంలో గురువారం ఈదురుగాలులు, వాన బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల తీవ్రత గతంలో సంభవించిన హుద్‌హుద్ తుఫానును తలపించేలా ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. నగరం వ్యాప్తంగా దాదాపు 80 ప్రాంతాల్లో 168 వరకు చెట్లు నేలకూలాయి. దీంతో సాధారణ జనజీవనానికి, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జీవీఎంసీ యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో, జీవీఎంసీ యంత్రాంగం తక్షణమే స్పందించి, ప్రజలు, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా యుద్ధప్రాతిపదికన తొలగింపు చర్యలు చేపట్టింది. జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి, అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల ప్రభావంతో నగరంలో 80 ప్రాంతాల్లో చెట్లు పాక్షికంగా, 168 వరకు పూర్తిగా నేలకూలాయని, 2 విద్యుత్ స్తంభాలు పడిపోయాయని కమిషనర్ తెలిపారు. జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో హార్టికల్చర్, మెకానికల్, ప్రజారోగ్య విభాగాలు సంయుక్తంగా పనిచేసి, 62 ప్రాంతాలలో అడ్డుగా ఉన్న వాటిని ఇప్పటికే తొలగించాయి. మిగిలిన చోట్ల కూడా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. జీవీఎంసీ 8 ప్రత్యేక బృందాలు, 17 జేసీబీల సాయంతో తొలగింపు కార్యక్రమం చేపట్టి, 145 చెట్లను పూర్తి స్థాయిలో తొలగించామన్నారు. . మిగిలిన 23 చెట్లను తొలగించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈదురు గాలులకు 9 విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయని, వాటిని వెంటనే పునరుద్దరణ కార్యక్రమం చేపట్టి విద్యుత్‌కు అంతరాయం లేకుండా తగు చర్యలు చేపట్టామన్నారు. కమిషనర్ స్వయంగా బిర్లా జంక్షన్ సర్వీస్ రోడ్డు, సర్క్యూట్ హౌస్ ప్రాంతాల్లో పనులను పర్యవేక్షించారు. ఈదురు గాలుల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించినట్లు ఏపీఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్‌ఈ శ్యాంబాబు తెలిపారు. వర్షాల ప్రభావంతో నగర పరిధిలోని 3 డివిజన్లలో విద్యుత్ లైన్లపై భారీ వృక్షాలు, కొమ్మలు విరిగిపడటంతో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. మొత్తం 95కు గాను 39 33కేవీ ఫీడర్లు, 574కు గాను 120 11కేవీ ఫీడర్లు దెబ్బతిన్నాయని తెలిపారు.
హోరు గాలి.. చెట్లు కూలి
హోరు గాలి.. చెట్లు కూలి
హోరు గాలి.. చెట్లు కూలి
హోరు గాలి.. చెట్లు కూలి