
దసరా మామూళ్లు ఇవ్వలేదని దాడి
మద్దిలపాలెం: విశాఖలోని రాంనగర్‌లో దసరా మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో హోటల్ నిర్వాహకులపై దాడి జరిగింది. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న చిట్టినాయుడు కోడి పలావ్ దుకాణాన్ని నడుపుతున్న అబ్బిరెడ్డి నరేంద్ర, అతని సోదరుడు మణికంఠపై ఈ దాడి జరిగింది. గురువారం ధనకోటి సురేష్, మడ్డు హరి, చంద్రాల మహేంద్రతో పాటు మరికొంతమంది వచ్చి దసరా మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిని ప్రశ్నించినందుకు, నిందితులు తీన్‌మార్ కర్రలతో నరేంద్ర, మణికంఠపై దాడికి దిగారు. ఈ దాడిలో నిర్వాహకుల్లో ఒకరికి కుడి కంటికి తీవ్ర గాయం అయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ పల్లా పైడియ్య ఆదేశాలతో ఎస్‌ఐ షేక్ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చిట్టినాయుడు కోడి పలావ్
నిర్వాహకులకు తీవ్ర గాయాలు