
50 అడుగుల ‘రావణ’ దహనం
కొమ్మాది: బీచ్‌రోడ్డు సాగర్‌నగర్ ఇస్కాన్ టెంపుల్‌లో గురువారం విజయదశమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ముందుగా ‘రామకళామృతం, రామగానామృతం’ కీర్తనలు, ఆలాపనలు భక్తిభావంతో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య ఆకర్షణగా సాయంత్రం 50 అడుగుల భారీ రావణ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమం జరిగింది. రావణ దహనం అనంతరం నిర్వహించిన ఫైర్ క్రాకర్స్ షో , సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, ఇస్కాన్ అధ్యక్షులు సాంబాదాస్ ప్రభుజీ, మాతాజీ నితాయి సేవినీ తదితరులు పాల్గొన్నారు.