
మత్స్యకారులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు
అధికారులకు కలెక్టర్ ఆదేశం
మహారాణిపేట: ప్రతి మత్స్యకారుడికి లబ్ధి చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. కలెక్టర్ చాంబర్‌లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథక జిల్లా స్థాయి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ పథకానికి సంబంధించి కొత్తగా లబ్ధిదారుల ఆమోదంపై చర్చించి.. బోట్లు, ఇంజన్లు, వలలు, ట్రాన్స్‌పాండర్లు, టెడ్ యూనిట్లను ప్రతిపాదించారు. బ్యాక్‌యార్డ్ ఆర్నమెంటల్ హ్యాచరీలు, సీ–వీడ్ పెంపకంపై దృష్టి సారించాలని మత్స్యశాఖ జేడీ లక్ష్మణరావును కలెక్టర్ ఆదేశించారు. సమావేశం అనంతరం తిమ్మాపురం మహిళా మత్స్యకార సంఘానికి విశాఖపట్నం పోర్ట్ సీఎస్సార్ నిధులతో సమకూర్చిన చేపల రవాణా వాహనాన్ని కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. జెడ్పీ సీఈవో నారాయణ మూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి, ప్రధాన శాస్త్రవేత్త డా.జోయి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, సత్యారావు, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, డీఆర్‌డీఏ అధికారులు హాజరయ్యారు.