
వృద్ధులను గౌరవించడం మన బాధ్యత
గాజువాక: వృద్ధాప్యంలో ఉన్నవారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక క్లబ్, వరిష్ట పౌరుల సమాఖ్య, లైన్స్ క్లబ్, వాయిస్ ఆఫ్ గాజువాక ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రపంచ వృద్ధుల దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్దలంటే తనకు ఎంతో గౌరవం, అభిమానం అన్నారు. వారి నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందన్నారు. వృద్ధుల దినోత్సవం అనడం కన్నా ఎల్డర్స్ డే అని పిలిస్తే బాగుటుందన్నారు. ఈనాటి యువత ఎంత బిజీగా ఉన్నా తాత, బామ్మలను కాపాడుకొని భవిష్యత్ తరాలు ఎలా మెలగాలో తెలుసుకోవాలన్నారు. 75 ఏళ్లు దాటిన వృద్ధులను ఈ సందర్భంగా సత్కరించారు. సౌత్ ఏసీపీ వై.శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఎ.జె.స్టాలిన్, ఆర్కే హాస్పిటల్ ఎండీ వేమూరి కృష్ణమూర్తి, నిర్వాహక సంఘాల ప్రతినిధులు చిక్కా సత్యనారాయణ, ఎస్.వి.రమణరాజు, నున్న శ్రీనివాసరావు, టి.వి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.