
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి
లక్ష గాజులతో సహస్రనామార్చన
డాబాగార్డెన్స్: దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా కనకమహాలక్ష్మి అమ్మవారు మంగళవారం గజలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి లక్ష గాజులతో సహస్రనామార్చన వైభవంగా నిర్వహించారు. నగరానికి చెందిన సుంకర రామరవీంద్ర, హైదరాబాద్‌కు చెందిన రామిరెడ్డి అనిత, విజయవాడకు చెందిన వెంకట బుజ్జి కిరణ్ రూ.1.25 లక్షల చొప్పున చెల్లించి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పూజలో పాల్గొన్నారు. బుధవారం అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమివ్వనున్నారని, అమ్మవారికి అన్ని రకాల కూరగాయల(శాకంబరీ)తో సహస్రనామార్చన చేయనున్నట్లు ఈవో శోభారాణి తెలిపారు.
అలాగే అంబికాబాగ్ రామాలయంలో బెంగాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి ఘనంగా పూజలు జరుగుతున్నాయి. మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.