
కై లాసగిరి కిటకిట
ఆరిలోవ: కైలాసగిరి పర్యాటక కేంద్రం సోమవారం సందర్శకులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాది మంది పర్యాటకులు తరలిరావడంతో కొండపై పండగ వాతావరణం నెలకొంది. పర్యాటకుల తాకిడికి కొండపైకి వెళ్లే వాహనాలు బారులు తీరాయి. కొండపై ఉన్న పార్కింగ్ స్థలం పూర్తిగా నిండిపోవడంతో, ఘాట్ రోడ్డుపై మొదటి మలుపు వరకు ఇరువైపులా కార్లు, టూరిస్ట్ బస్సులతో సహా ఇతర వాహనాలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండపై ఉన్న పచ్చిక బయళ్లు, ఆట స్థలాలు సందర్శకులతో నిండిపోయాయి. పిల్లలు ఆట వస్తువులతో ఆడుకుంటూ ఉత్సాహంగా గడిపారు. శివపార్వతుల విగ్రహాలు, సీ వ్యూ పాయింట్ వద్ద పర్యాటకులు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. సాధారణంగా ఆదివారాలు రద్దీగా ఉండే కై లాసగిరి.. సోమవారం కూడా జనసంద్రంగా మారడానికి పాఠశాలలకు, కళాశాలలకు దసరా సెలవులు ప్రకటించడం ఒక కారణమైతే, సోమవారం జంతు ప్రదర్శనశాలకు సెలవు దినం కావడం మరో కారణం. దీంతో జూకు వెళ్లాలనుకున్న పర్యాటకులు సైతం కై లాసగిరికి తరలిరావడంతో రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువైంది. ఈ రద్దీ కారణంగా టాయ్ ట్రైన్ నిరంతరం పర్యాటకులతో తిరిగింది. సందర్శకుల తాకిడితో వీఎంఆర్డీఏకు గణనీయమైన ఆదాయం లభించింది.
సీ వ్యూ పాయింట్ వద్ద సందర్శకులు
కై లాసగిరిపై ఆటలాడుతున్న పిల్లలు

కై లాసగిరి కిటకిట

కై లాసగిరి కిటకిట