
ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఉక్కునగరం: బతుకమ్మ సంబరాలు ఉక్కునగరంలో సోమవారం ఘనంగా ముగిశాయి. స్టీల్‌ప్లాంట్ తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉక్కునగరం సీ భవనంలో ఈ వేడుకలు జరిగాయి. తెలంగాణ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. అంతకుముందు స్టీల్‌ప్లాంట్ హెచ్‌ఆర్ జీఎం ఎన్.భాను, హెచ్‌ఆర్ డీజీఎం డి.రాధిక ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ముఖ్య సలహాదారు ఎన్.వీరేశం, అధ్యక్షుడు ఎన్.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి జి.ఆనంద్, బి.వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, రవిశేఖర్, మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.