వాన..
శనివారం అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. కర్ణాటక సరిహద్దు నుంచి రాకపోకలు స్తంభించాయి. కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగునీరు ఉధృతంగా ప్రవహించి పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరగా.. కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. – వికారాబాద్ నెట్‌వర్క్
● పొంగిన వాగులు, వంకలు
● ఉగ్రరూపం దాల్చిన కోట్‌పల్లి ప్రాజెక్టు
● నీట మునిగిన పంటలు
● నిలిచిన రాకపోకలు
70.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు
తాండూరురూరల్: ఐనెల్లిలో తడిసిన సోయాబీన్ పంటను చూపుతున్న రైతులు
బంట్వారం: బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లో ఆదివారం తెల్లవారుజామునుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు వరదతో పోటెత్తాయి. కంకణాలపల్లి వాగు ఉధృతంగా ప్రవహించింది. సల్బత్తాపూర్‌లో గుట్టపై నుంచి పారిన వరద ఇళ్లలోకి చేరింది. కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
శాశ్వత పరిష్కారం చూపాలి
ఆర్‌అండ్‌బీ అధికారుల తప్పిదంతో వర్షం కురిసిన ప్రతీసారి వరద నీరు ఇళ్లలోకి చేరుతుందని సల్బత్తాపూర్ కాలనీ వాసులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేసే సమయంలో ఇరువైపులా కాల్వలు తవ్విన కాంట్రాక్టర్ అలాగే వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా వర్షం పడిన ప్రతీసారి తమకు ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. లేదంటే వికారాబాద్ ఆర్‌అండ్‌బీ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.
హైరానా