యువతకు ప్రాధాన్యమివ్వండి | - | Sakshi
Sakshi News home page

యువతకు ప్రాధాన్యమివ్వండి

Oct 6 2025 6:27 AM | Updated on Oct 6 2025 6:37 AM

యువతకు ప్రాధాన్యమివ్వండి బీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ పట్టణ అధ్యక్షుడిగా కిశోర్‌ రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ దుకాణాల కూల్చివేత దారుణం

పరిగి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు రాఘవేందర్‌ గౌడ్‌

కుల్కచర్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యమివ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పరిగి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు రాఘవేందర్‌ గౌడ్‌ కోరారు. ఆదివారం ఆయన నగరంలోని రాంచందర్‌నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీ అభ్యున్నతి కోసం స్థానిక నాయకత్వానికి పెద్దపీట వేయాలని కోరారు. ఈ సందర్భంగా రాచందర్‌రావును ఆయన ఘనంగా సన్మానించారు.

అనంతగిరి: బీఆర్‌ఎస్‌ బీసీ సెల్‌ వికారాబాద్‌ పట్టణ అధ్యక్షుడిగా కిశోర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ చేతులమీదుగా నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా కిశోర్‌ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు ఽసంతోషంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికపుడు స్పందించి ఉద్యమిస్తామన్నారు. కాంగ్రెస్‌ మోసాలను ఎండగడతామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గోపాల్‌, మాజీ కౌన్సిలర్‌ అనంత్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, సీనియర్‌ నాయకులు శేఖర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మల్లికార్జున్‌, సురేశ్‌, సుభాన్‌రెడ్డి, ముర్తుజా అలీ, మల్లేశ్‌, రమణ, వేణుగోపాల్‌, అనంత్‌రెడ్డి, ఫరీద్‌, నరసింహ, వరుణ్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

షాద్‌నగర్‌: దసరా సెలవులు ముగిసాయి.. పండుగకు స్వగ్రామాలకు వచ్చిన వారంతా పట్నానికి తిరుగు పయనం అయ్యారు. ఫలితంగా హైదరాబాద్‌ – బెంగళూరు 44వ నంబర్‌ జాతీయ రహదారి రద్దీగా మారింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌ వైపు వాహనాలు క్యూ కట్టాయి. షాద్‌నగర్‌ పరిధిలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద బారులు తీరి కనిపించాయి. వాహనదారులకు ఎలాంటి ఆటంకం కలగకుండా టోల్‌సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.

తుర్కయంజాల్‌: పెద్దలను వదిలి పేదలు, చిరు వ్యాపారులపై చర్యలు తీసుకోవడం దారుణమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్‌ అన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆదివారం మున్సిపల్‌ అధికారులు చిరు వ్యాపారుల గుడిసెలను తొలగించి, వారిని ఉపాధికి దూరం చేశారని ఆరోపించారు. ఏళ్లుగా రోడ్డుకు ఇరువైపులా చిన్న చిన్న గుడిసెలను వేసుకుని, మధ్యాహ్న భోజనం, పండ్లను విక్రయిస్తున్నారని, అలాంటి వారికి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వనిత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని విమర్శించారు. రోజువారీ అప్పులు చెల్లిస్తూ, ఉపాధి పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవడంతో పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సీపీఎం, సీఐటీయూ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఈ.నరసింహ, సీహెచ్‌ ఎల్లేశ్‌, సత్యనారాయణ, యాదయ్య పాల్గొన్నారు.

యువతకు  ప్రాధాన్యమివ్వండి 1
1/2

యువతకు ప్రాధాన్యమివ్వండి

యువతకు  ప్రాధాన్యమివ్వండి 2
2/2

యువతకు ప్రాధాన్యమివ్వండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement