బ్యాంక్‌లోనే బ్యాగ్‌ కొట్టేద్దామని! | - | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌లోనే బ్యాగ్‌ కొట్టేద్దామని!

Jun 1 2025 1:18 AM | Updated on Jun 1 2025 1:18 AM

బ్యాం

బ్యాంక్‌లోనే బ్యాగ్‌ కొట్టేద్దామని!

స్టేషన్‌ వద్ద గుమికూడిన జనం

సైదాపురం: సైదాపురం పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఓ బ్యాంక్‌కు వచ్చిన మహిళ బ్యాగ్‌ను మహిళా దొంగ కొట్టేసేందుకు యత్నించిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. బాధితురాలి కథనం.. మండలంలోని అనంతమడుగు గ్రామానికి చెందిన బండి శశికళ సైదాపురంలోని సిండికేట్‌ బ్యాంకులో బంగారు రుణం చెల్లించేందుకు శనివారం స్వగ్రామం నుంచి బ్యాంకుకు చేరింది. శశికళ ఓచర్‌ రాస్తున్న సమయంలో ఓ మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. ఓచర్‌ రాసి బ్యాగును చూడగా.. బ్లేడుతో కోసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అక్కడే ఉన్న ఆ మహిళను ప్రశ్నించగా బ్యాంకులో నుంచి ఉడాయిచింది. స్థానికులు ఆ మహిళను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం బాధితురాలు రాపూరు సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ క్రాంతికుమార్‌కు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

చోరీకి యత్నించిన మహిళా దొంగ

బ్యాంక్‌లోనే బ్యాగ్‌ కొట్టేద్దామని!1
1/1

బ్యాంక్‌లోనే బ్యాగ్‌ కొట్టేద్దామని!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement