
రుణ సౌకర్యం ఎంతో మేలు
ప్రధానమంత్రి స్వనిధి రుణాల్లో భాగంగా మాకు మొదటిసారిగా రూ.10వేల లోన్ ఇచ్చారు. తర్వాత రూ.20వేలు ఇచ్చారు. అవి పూర్తిగా కట్టాం. ఇప్పుడు రూ.50వేల రుణం తీసుకొని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా. వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రుణం తీసుకోకుండా ప్రభుత్వం అందించే ఈ సౌకర్యం ఎంతో మేలు.
– గౌస్య, కూరగాయల వ్యాపారి
లోక్ కల్యాణ్ మేళా ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే రుణాలను వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం ఇచ్చే రుణాలు పొంది వ్యాపారాన్ని విస్తరించుకొని ఆర్థికంగా బలపడి పలువురికి ఆదర్శంగా నిలవాలి.
– సీహెచ్ హనుమంత రెడ్డి, మెప్మా పీడీ

రుణ సౌకర్యం ఎంతో మేలు