
జనహృదయ నేతకు కన్నీటి వీడ్కోలు
ఫ తుంగతుర్తిలో ముగిసిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు
ఫ తమ అభిమాన నాయకుడిని
కడసారి చూసేందుకు
తరలివచ్చిన ప్రజలు, పార్టీ శ్రేణులు
ఫ జోహార్ దామన్న అంటూ అశ్రునివాళి
ఫ హాజరైన మంత్రులు ఉత్తమ్,
కోమటిరెడ్డి, లక్ష్మణ్‌కుమార్, పీసీసీచీఫ్ మహేష్‌కుమార్, ఎమ్మెల్యేలు, ఎంపీ
తుంగతుర్తి: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసుకున్న జనహృదయనేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తన గడి వెంట ఉన్న వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటలకు గౌరవసూచకంగా పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆర్డీఆర్ కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. ఉమ్మడి జిల్లాలో తిరుగులేని నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దామన్నను కడసారి చూసేందుకు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు, అభిమానులు, పార్టీశ్రేణులు తండోపతండాలుగా తరలివచ్చారు. తమ అభిమాన నేతను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. జోహార్ దామన్న అంటూ నినాదాలు చేశారు.
ప్రముఖుల శ్రద్ధాంజలి
ఈ అంత్యక్రియల్లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వృద్ధుల వికలాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, నలగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్మేలు మందుల సామేలు, పద్మాతిరెడ్డి, కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అనిల్‌రెడ్డి రాజేందర్‌రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు సంకేపల్లి సుధీర్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌రావు, గాదరి కిషోర్‌కుమార్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పరమేశ్వర్‌రెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి, మహిళా కాంగ్రెస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు అనురాధ కిషన్‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతు భాస్కర్, టీపీసీసీ సభ్యుడు గుడిపాటి నర్సయ్య, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్, ఎస్పీ కె.నరసింహలతో పాటు పలువురు ప్రముఖులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలిఘటించారు.
శోక సంద్రంలో తుంగతుర్తి
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి తుంగతుర్తి ప్రజలతో పాటు, ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. జనహృదయనేతను కడసారి చూసేందుకు ప్రజలు, అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. దామోదర్ రెడ్డి పార్థివ దేహం శుక్రవారం రాత్రి తుంగతుర్తిలోని స్వ గృహానికి చేరే వరకు వేచి ఉన్నారు. అలాగే శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నివాళులర్పించారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు.

జనహృదయ నేతకు కన్నీటి వీడ్కోలు

జనహృదయ నేతకు కన్నీటి వీడ్కోలు

జనహృదయ నేతకు కన్నీటి వీడ్కోలు

జనహృదయ నేతకు కన్నీటి వీడ్కోలు

జనహృదయ నేతకు కన్నీటి వీడ్కోలు