
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేసి స్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం నిత్యకల్యాణతంతును ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, బ్రహ్మచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్యారాధనలో భాగంగా నిత్య కల్యాణం నేత్రపర్వంగా చేపట్టారు. శనివారం వేకువజామున శ్రీస్వామి,అమ్మవార్లకు సుప్రభాత సేవ, అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం వేళ వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
మూసీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరదనీటి రాక కొనసాగుతోంది. శనివారం మూసీకి 2,579 క్యూసెక్కుల వరదనీరు వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు రెండు క్రస్ట్‌గేట్లను పైకెత్తి 2,601 క్యూసెక్కుల నీటిని వరదనీటిని దిగువకు వదులుతున్నారు. ఆయకట్టులో పంటల సాగు కోసం ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వకు 529 నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4.12 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
పర్యాటకుల సందడి
నాగార్జునసాగర్ : సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతుండటంతో పర్యాటకుల సందడి నెలకొంది. శనివారం సాగర్‌కు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. కృష్ణాతీరం వెంట, ఎత్తిపోతల, అనుపు, బుద్ధవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించేందుకు లాంచీల్లో వెళ్లారు. అక్కడ మ్యూజియంలోగల రాతి, ఇనుప పనిముట్లు, బౌద్ధమతవ్యాప్తికి సంబంధించిన ఆనవాళ్లు, విగ్రహాలను సందర్శించారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మట్టపల్లిలో నిత్యకల్యాణం