
డబ్బు, మద్యంతో గెలిచేందుకు కుట్ర
సూర్యాపేట అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధాన పాలకవర్గ పార్టీలతో పాటు మతోన్మాదన శక్తులు డబ్బు, మద్యం, కులం, మతం, బంధుప్రీతితో గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో కునుకుంట్ల సైదులు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ఎన్నికల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఐఎఫ్‌టీయూ జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంచనపల్లి సైదులు, ఏఐకేఎంఎస్ డివిజన్ అధ్యక్షుడు సంపేట కాశయ్య, దాసరి శ్రీనివాస్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు నల్గొండ నాగయ్య, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల నరసమ్మ, ఐఎఫ్‌టీయూ జిల్లా కమిటీ సభ్యులు సామ నర్సిరెడ్డి పాల్గొన్నారు.