
డాక్టర్ పెంటయ్య సేవలు అద్భుతం
ఫ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ సుబ్బారాయుడు
ఫ కోదాడలో పశు ఔషధ బ్యాంకు
ఏర్పాటును ప్రశంసించిన రాయుడు
కోదాడరూరల్ : కోదాడ పట్టణ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య మూగజీవులకు అందిస్తున్న వైద్యసేవలు అద్భుతమని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.సుబ్బారాయుడు ప్రశంసించారు. శుక్రవారం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలను సందర్శించి ఆయన మాట్లాడారు. కోదాడ పట్టణ ప్రాంత జంతువులకే కాక పరిస ప్రాంత జంతువులను కోదాడకు తీసుకొచ్చి వాటికి కూడా ఎంతో ఓపికతో డాక్టర్ పెంటయ్య చేస్తున్న వైద్యసేవలను చూసి అభినందించారు. అదేవిధంగా దాతల సహకారంతో పశుఔషధ బ్యాంకును ఏర్పాటు చేసి సంవత్సర కాలంగా రైతులకు తక్కువ ధరలకే మందులను అందజేయడం గొప్పవిషయమని అన్నారు. ఈ విధంగా ఏడాదిలో రూ.3.5కోట్ల అదనపు ఉత్పత్తుతులను సాధించి రివాల్వింగ్ ఫండ్‌తో ప్రణాళిక పద్ధతిలో మందులను తీసుకొచ్చి పాడి రైతులు, జీవాల పెంపకందారులు, పలు రకాల జంతువుల పోషకులకు మందులు అందజేస్తున్న డాక్టర్ పెంటయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన వెంట డాక్టర్ పెంటయ్య, వైద్యసిబ్బంది ఉన్నారు.