
నేడు విజయ దశమి
సూర్యాపేట అర్బన్: దసరా పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.శమీ, ఆయుధ పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటారు. దుర్గాదేవిని ఆరాధించడం, ఆమెను శక్తి స్వరూపిణిగా భావించడం ఈ పండుగ ప్రత్యేకత.
ఆయుధ పూజ
పోలీసులు దసరా రోజు ఆయుధాలకు పూజలు చేస్తారు. అలాగే పరిశ్రమల్లో యంత్రాలు, ఇతర పరికరాలకు పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అలాగే చాలామంది దసరా రోజు సాయంత్రం పాలపిట్టను చూస్తారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేదా సహజంగా ఉన్న జమ్మి వృక్షం వద్దకు వెళ్లి పూజలు చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. రావణ ప్రతిమలు ఏర్పాటు చేసి దహనం చేస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో శమీ పూజకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేశారు.
మార్కెట్‌లలో సందడి
కొనుగోలుదారులతో మార్కెట్‌లు సందడిగా మారాయి. జీఎస్టీ తగ్గడంతో బైకులు, కార్లు కోనుగోలు చేసేందుకు ఎక్కువ మంది అసక్తి చూపుతున్నారు. దీంతో బైకులు, ఎలక్ట్రికల్, వస్త్రదుకాణాలు, ఫుట్‌వేర్, లేడీస్ ఎంపోరియం, పూలు, పండ్లు, కూరగాయల దుకాణాలు రాత్రి పొద్దుపోయే వరకు వినియోగదారులతో కిటకిటలాడాయి.
రహదారులపై వాహనాల రద్దీ
సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి పట్టణాల్లో రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. షాపింగ్ చేసేందుకు ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లుండడంతో ట్రాఫిక్ నెలకొంది. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు, బైక్‌లపై సొంతూళ్లకు వెళ్లారు. ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి.
ఫ వేడుకలకు సిద్ధమైన ప్రజలు
ఫ పట్టణాలు, పల్లెల్లో సందడి
ఫ శమీ పూజకు,
రావణ దహనానికి ఏర్పాట్లు

నేడు విజయ దశమి