
ప్లాస్టిక్ భూతంపై సమరం
ఫ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో 15 అడుగుల భూతం తయారీ
ఫ సూర్యాపేట జిల్లా కేంద్రంలో గ్రీన్ క్లబ్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రదర్శన
సూర్యాపేట అర్బన్: సూర్యాపేట జిల్లా కేంద్నానికి చెందిన గ్రీన్ క్లబ్ ట్రస్టు కొన్నేళ్లుగా ప్లాస్టిక్ భూతంపై సమరం సాగిస్తోంది. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశంలోనే మొదటిసారిగా సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డలో గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ వద్ద మున్సిపాలిటీ సహకారంతో ఏర్పాటు చేసిన 15 అడుగుల ప్లాస్టిక్ భూతాన్ని బుధవారం ఆ క్లబ్ సభ్యులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్టు అధ్యక్షుడు ముప్పారపు నరేందర్ మాట్లాడుతూ రావణాసురుడి కంటే భయంకరమైనది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని పేర్కొన్నారు. విజయదశమి నుంచి ప్లాస్టిక్‌ను తరిమివేస్తామంటూ ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులు తోట కిరణ్ సహాయ కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు ముప్పారపు నాగేశ్వరరావు, తల్లాడ రామచంద్రయ్య, తొణుకునూరు మురళీమోహన్‌లను మున్సిపల్ కమిషనర్ సీహెచ్.హనుమంతరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఎండి గౌసుద్దీన్, పర్యావరణ విభాగం ఇంజనీర్ శివప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ పాల్గొన్నారు.