
పండుగ గుర్తెరగం
నా చిన్నతనం నుంచి నేటి వరకు కూడా మా గ్రామంలో దసరా ఉత్సవాలు నిర్వహించడం చూడలేదు. మా గ్రామంలో గతంలో దసరా ఉత్సవాల సందర్భంగా కంకణం కట్టే విషయంలో కులాల మధ్య ఏర్పడిన ఘర్షణల వలన నేటికీ పండుగ జరుపుకోవడం లేదు.
– పసునూటి అయోధ్య, మాచనపల్లి
నా వయస్సు 34 సంవత్సరాలు. గ్రామంలో దసరా ఉత్సవాలు నిర్వహించక దాదాపు 42 సంవత్సరాలు. మా గ్రామంలో సీపీఎం, సీపీఐ(ఎంఎల్) మధ్య ఆధిపత్య పోరుతో కంకణం కట్టుకునే విషయంలో ఏర్పడిన ఘర్షణ వలన దసరా జరుపుకోవడం లేదు. ఇప్పటికై నా పాలకులు, రాజకీయ పార్టీల నాయకులు కలిసి దసరా పండుగ జరుపుకునేలా చూడాలి.
– పులుసు సతీష్‌గౌడ్, చిల్పకుంట్ల
●

పండుగ గుర్తెరగం