
బాస్కెట్‌బాల్ క్రీడాకారిణికి సన్మానం
మాడుగులపల్లి: మాడుగులపల్లి మండలం గారెకుంటపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకట్‌రెడ్డి కుమార్తె విహారెడ్డి మలేషియాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో అండర్–16 బాస్కెట్‌బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో మంగళవారం గారెకుంటపాలెం గ్రామంలో విహారెడ్డిని గ్రామస్తులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. విహారెడ్డి చిన్నతనం నుంచే బాస్కెట్‌బాల్ క్రీడలో రాణించి జాతీయ జట్టుకు ఎంపికై భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రత్నమాల, ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.