
జాతీయ రహదారిపై జంక్షన్ల విస్తరణకు చర్యలు
చౌటుప్పల్ రూరల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించడానికి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు జంక్షన్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం బొర్రోళ్లగూడెం గ్రామం వద్ద ఉన్న జంక్షన్‌ను ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కలిసి ఏసీపీ పరిశీలించి మాట్లాడారు. దండుమల్కాపురం పరిధిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ ఉండడంతో భారీ ట్యాంకర్లు రోడ్డు క్రాస్ చేసే సమయంలో హైవేపై ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దండుమల్కాపురం, బొర్రోళ్లగూడెం, కై తాపురం గ్రామాల వద్ద ఉన్న జంక్షన్లను విస్తరిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ సహకారంతో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. హైవేపై ప్రయాణించే వాహనాల వేగం జంక్షన్ల వద్ద తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి ఇంజనీరింగ్ విభాగం అధికారులు కిషన్‌రావు, శరత్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ డీజీఎం విశ్వేశ్వరరావు, చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐ విజయ్‌మోహన్ పాల్గొన్నారు.
ఫ ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి