
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి
సూర్యాపేట అర్బన్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచేందుకు సన్నద్ధంకావాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరైన మాట్లాడారు. ఈఎన్నికల్లో కావాల్సిన వ్యూహాన్ని రచించుకోవాలని, కలిసి వచ్చే రాజకీయ శక్తులతో ఫ్రంట్ గా ఏర్పడి స్థానికల ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని కోరారు. బద్దం కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యల్లావుల రాములు, ధూళిపాళ ధనుంజయనాయుడు, యల్లంల యాదగిరి, మేకల శ్రీనివాసరావు, మండవ వెంకటేశ్వర్లు, బత్తినేని హనుమంతరావు, పోకల వెంకటేశ్వర్లు ఎస్.కె. లతీఫ్, బూర వెంకటేశ్వర్లు, సాయబెల్లి, దేవరం మల్లేశ్వరి పాల్గొన్నారు.