
రంగుమారిన పత్తిని ప్రభుత్వమే కొనాలి
ఆరు ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాను. ఎకరానికి సుమారు రూ.15 వరకు ఖర్చు అయ్యింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తిచేను మొత్తం ఎర్రబారింది. ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశమే ఉంది. రంగుమారిన పత్తిని ప్రభుత్వం కొనాలి. ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి.
– బండగొర్ల దుర్గయ్య, రైతు, పస్తాల, నాగారం మండలం
పత్తిచేలల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వరుస వర్షాల కారణంగా పత్తిచేలల్లో నీరు ఎక్కువగా నిలిచి ఉంటే చిన్న, చిన్న కాలువలు ఏర్పాటు చేసి నీటిని తొలగించాలి. పత్తిలో రసంపీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమల నివారణకు వ్యవసాయశాఖ అధికారులు సలహాలతో సకాలంలో మందులు పిచికారీ చేసుకోవాలి.
– జి.శ్రీధర్‌రెడ్డి,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

రంగుమారిన పత్తిని ప్రభుత్వమే కొనాలి