
ట్రాక్టర్ పంపిస్తాం.. డీజిల్ పోసుకోండి!
జానకీనగర్ గ్రామ వీధుల్లో ఉన్న చెత్త, నరికేసిన చెట్ల కొమ్మలు
చిలుకూరు: మండలంలోని జానకీనగర్ గ్రామ వీధులు చెత్తమయంగా మారాయి. గ్రామ పంచాయతీ (జీపీ) సిబ్బంది తొలగించకపోవడంతో వీధుల్లో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. చెత్తను తొలగించమని గ్రామ పంచాయతీని కోరితే డీజిల్‌కు డబ్బులు లేక జీపీ ట్రాక్టర్ నడవడం లేదని, ట్రాక్టర్‌ను పంపుతాం.. డీజిల్ పోసుకోండి అని అంటున్నారని గ్రా మస్తులు వాపోతున్నారు. చెత్తతోపాటు చెట్ల కొమ్మలను తొలగించి వీధుల్లోనే వేశారు. దీంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, వెంటనే చెత్తను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై కార్యదర్శి రజితను వివరణ కోరగా నిధుల కొరత ఉందని, ట్రాక్టర్ డీజిల్‌కు కూడా నిధులు లేవని తెలిపారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఆమె వివరణ ఇచ్చారు.
ఫ జానకీనగర్ వాసులతో జీపీ సిబ్బంది
ఫ చెత్తమయంగా గ్రామ వీధులు
ఫ వెంటనే వీధుల్లో చెత్త, చెట్ల కొమ్మలను
తొలగించాలని గ్రామస్తుల వేడుకోలు

ట్రాక్టర్ పంపిస్తాం.. డీజిల్ పోసుకోండి!