ఉత్కంఠకు తెర | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠకు తెర

Sep 28 2025 6:51 AM | Updated on Sep 28 2025 6:51 AM

ఉత్కంఠకు తెర

ఉత్కంఠకు తెర

పంచాయతీల్లో ఎన్నికల సందడి

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వడంతో పంచాయతీల్లో సందడి నెలకొంది. గ్రామాల్లో రిజర్వేషన్ల కోసం ఇన్ని రోజులు వేచి చూసిన ఆశావహులకు రిజర్వేషన్లు కేటాయించడంతో తమకు అనుకూలంగా వచ్చిన వారు ఆనందంలో ఉండగా అనుకూలంగా రిజర్వేషన్లు రాని ఆశావహులకు నిరాశలో పడ్డారు. గ్రామాల్లో ఇక ఎన్నికల సమరమే మిగిలి ఉంది. ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇస్తుందో వేచిచూడాల్సిందే.

సూర్యాపేటటౌన్‌ : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను జిల్లా అధికార యంత్రాంగం శనివారం ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తూ శుక్రవారం జీవో విడుదల చేసింది. దాని ప్రకారంగా జిల్లా అధికారులు జిల్లాలోని 23 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, 235 ఎంపీటీసీలు, 486 గ్రామ సర్పంచ్‌లు, 4,388 వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సమక్షంలో జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్‌, ఆర్డీఓల సమక్షంలో ఎంపీటీసీ, సర్పంచ్‌ల రిజర్వేషన్లను ఖరారు చేశారు. అలాగే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరీలతో కలిపి మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ తగ్గకుండా కేటాయించారు. నాలుగు రోజులుగా కలెక్టర్‌ ఆధ్వర్యంలో అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించారు. ఈ సారి జెడ్పీ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తికావడంతో ఇన్నాళ్లుగా రాజకీయ నాయకులు, ఆశావహుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

42శాతంతో మెజార్టీ స్థానాలు బీసీలకే..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం కేటాయిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీచేయడంతో వారికే మెజార్టీలు స్థానాలు దక్కాయి. జిల్లాలో 23 మండలాలకు సంబంధించి ఎంపీపీలు, జెడ్పీటీసీ స్థానాలు 42శాతం రిజర్వేషన్ల ఆధారంగా కేటాయించారు. మొత్తం 23 మండలాల్లో ఎంపీపీల రిజర్వేషన్లు ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు మూడు, బీసీలకు 10, జనరల్‌ స్థానాలు ఐదు కేటాయించారు. అలాగే 23 మండలాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు మూడు, బీసీలకు 10, జనరల్‌ స్థానాలు ఐదు కేటాయించారు. దీంతో బీసీల్లో ఆశావహులు ఆనందంతో ఉన్నారు.

స్థానిక సంస్థల

రిజర్వేషన్లు ఖరారు

ఫ జెడ్పీ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వు

ఫ ప్రకటించిన అధికారులు

ఫ బీసీలకు అత్యధిక స్థానాలు

ఫ పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి

ఫ జిల్లాలో 23 మండలాలు,

486 గ్రామ పంచాయతీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement