
బీసీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్ : తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వంలో తాను చైర్మన్‌గా ఉన్న కమిటీ 3.70 కోట్ల మందిని ఇంటింటి సర్వే నిర్వహించి బీసీ కులగణన చేసిందని తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం బీసీలు ఉన్నారని, తమ ప్రభుత్వం బీసీలకు విద్యలో, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్‌లో, శాసనసభలో బిల్లును ఆమోదించి చట్టం చేశామని మంత్రి గుర్తుచేశారు.