
భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు
హుజూర్‌నగర్: భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్‌లో రాజీవ్ చౌక్ నుంచి ఫణిగిరి గుట్ట వరకు రూ 6.50 కోట్లతో చేపట్టనున్న డబుల్ రోడ్డు పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఏర్పడే రద్దీని దృష్టిలో ఉంచుకుని రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాల కోసం అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దసరా పండుగ అందరికీ శుభాలు కలగజేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్, డీఈ సీతారామయ్య, ఏఈఈ కిరణ్ కుమార్, శివ, నాయకులు యరగాని నాగన్న గౌడ్, తన్నీరు మల్లిఖార్జున్, శివరాం యాదవ్, అరుణ్ కుమార్ దేశ్‌ముఖ్, శ్రీనివాస్, మల్లయ్య, హరిబాబు, శ్రీనివాస్‌రెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, సావిత్రి పాల్గొన్నారు.