
నేరాల నియంత్రణలో పోలీసుల పనితీరు భేష్
సూర్యాపేటటౌన్ : నేరాల నియంత్రణలో జిల్లా పోలీస్ పనితీరు భేష్ అని రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ సబ్సిడరీ క్యాంటిన్, పోలీస్ ఫిట్‌నెస్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్యాంటిన్ ద్వారా హోం గార్డ్ నుంచి ఎస్పీ వరకు ఆర్థికపరంగా నెలకు సగటున రూ.3వేల నుంచి రూ.5 వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు. జిల్లా పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ అమలు చేస్తున్న పోలీసు ప్రజా భరోసా అద్భుతమైన కార్యక్రమమని, దీని ద్వారా ఫలితాలు వస్తున్నాయన్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్టంగా పనిచేయాలన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్, పోర్ట్ వాల్ కట్టించడానికి రూ.30 లక్షలు మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలో నమోదవుతున్న నేరాలు, నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను ఎస్పీ నరసింహ వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు రవీందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, మార్కెట్ చైర్మన్ వేణారెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఫ మహిళా భద్రతకు
అధిక ప్రాధాన్యమివ్వాలి
ఫ రోడ్డు ప్రమాదాల నివారణకు
పటిష్ట చర్యలు తీసుకోవాలి
ఫ ఎస్పీ కార్యాలయంలో క్యాంటిన్,
ఫిట్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించిన
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నేరాల నియంత్రణలో పోలీసుల పనితీరు భేష్