
పబ్లిక్ టాయిలెట్లు లేక ఇబ్బంది
మున్సిపాలిటీల వారీగా పబ్లిక్ టాయిలెట్ల వివరాలు
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ప్రజా మరుగుదొడ్లు సరిపడా లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం పట్టణ కేంద్రాలకు ఎంతోమంది వస్తుంటారు. వీరంతా టాయిలెట్‌కి ఎక్కడికి వెళ్లాలనేది ప్రధాన సమస్యగా మారింది. తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఉగ్గపట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉన్నా అన్ని మున్సిపాలిటీల్లో ఆ సదుపాయం లేదు. కొన్ని పట్టణాల్లో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో సర్వే చేయకుండానే పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడంతో ఉపయోగం లేకుండా పోయాయి. మున్సిపల్ అధికారులు దృష్టి కేంద్రీకరించి ప్రధాన రద్దీ స్థలాల్లో ప్రజా మరుగుదొడ్లు నిర్మిస్తే ప్రజలకు, వ్యాపారస్తులకు, వాహనదారులకు వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
వెయ్యి జనాభాకు ఒకటి ఉండాలి
స్వచ్ఛభారత్ మార్గదర్శకాల ప్రకారం మున్సిపాలిటీల్లో ప్రతి 1000 జనాభాకు ఒక మరుగుదొడ్డి చొప్పున అందుబాటులో ఉండాలి. అందులో సీ్త్ర పురుషులకు 50 శాతం చొప్పున ఉండాలి. ప్రజా మరుగుదొడ్లు నిర్మాణాలను అనుకూలంగా లేని పట్టణాల్లో కనీసం బయో టాయిలెట్లు అయినా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పాత ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి వాటిలో సీ్త్ర, పురుషులకు వేరువేరుగా సంచార మరుగుదొడ్లు, మూత్రశాల సదుపాయాన్ని కల్పించాల్సి ఉన్నా అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. సూర్యాపేట మున్సిపాలిటీ మినహాయిస్తే ఇతర మున్సిపాలిటీల్లో బయో టాయిలెట్లు సదుపాయం కూడా అందుబాటులో లేదు. బస్సు లోపలి మరుగుదొడ్లను వినియోగించేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపకపోవడంతో అవి కూడా మూలకు చేరాయి. హుజూర్‌నగర్‌లో మొత్తం 35 పబ్లిక్ ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 28 ఉన్నాయి. ఇందులో 21 నడుస్తుండగా.. 8 మూతబడ్డాయి. కోదాడ మున్సిపాలిటీలో 80 పబ్లిక్ టాయిలెట్స్‌కు ప్రస్తుతం 8 ఉన్నాయి. అందులో 3 రిపేర్‌లో ఉన్నాయి. నేరేడుచర్లలో మున్సిపాలిటీలో నాలుగు ప్రజా మరుగుదొడ్లు నడుస్తున్నాయి. అధికారులు స్పందించి పట్టణ ప్రాంతాలకు వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా అవసరమైన ప్రదేశాల్లో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని కోరుతున్నారు.
ఫ మున్సిపాలిటీల్లో సరిపడా లేని
ప్రజా మరుగుదొడ్లు
ఫ మహిళా శౌచాలయాలు, సంచార
టాయిలెట్లు అంతంత మాత్రమే
మున్సిపాలిటీలు జనాభా పబ్లిక్ టాయిలెట్స్ మహిళల మొబైల్
ఉండాల్సినవి ఉన్నవి టాయిలెట్స్ టాయిలెట్స్
సూర్యాపేట 1,53,000 150 120 14 06
హుజూర్‌నగర్ 35,000 35 28 12 –
కోదాడ 80,000 80 08 – –
నేరేడుచర్ల 14,989 15 8 04 –
తిరుమలగిరి 18,747 18 12 06 –