
వేతనాలు చెల్లించాలని రాస్తారోకో
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు ఐదు నెలలుగా చెల్లించడం లేదని ఆరోపిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, టీఆర్‌పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య, సీపీఎం నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు వేర్వేరుగా మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఐదు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట
ఉద్యోగుల రాస్తారోకో