
యువజన పోరాటాలు ఎంతో అవసరం
కోదాడ : ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో యువజన పోరాటాలు ఎంతో అవసరమని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జేవీ చలపతిరావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని లాల్‌బంగ్లాలో నిర్వహించిన పీవైఎల్ (ప్రగతిశీల యువజన సంఘం) రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్యలపై, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలపై తిరుగుబాటు చేయాలన్నారు. పాలకులు మతోన్మాద ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ప్రజలను భ్రమలో ఉంచారని పేర్కొన్నారు. ముస్లిం, మైనార్టీలపై, కమ్యూనిస్టులు, హేతువాదులపై మతోన్మాద బీజేపీ యుద్ధం ప్రకటిస్తుందని ఆరోపించారు. శిక్షణ తరగతులకు ముందుగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ జెండాను ఆవిష్కరించారు. ఏఐకెఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు ప్రారంభ ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో ఆవునూరి మధు, పీవైఎల్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి ఐలయ్య, ప్రజా చైతన్యవేదిక నాయకులు రాయపూడి చిన్ని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనమాల సత్యం, గొర్రెపాటి సత్యం, సహాయ కార్యదర్శి బేజాడి కుమార్, పర్శిక రవి, ఎం.సిద్దేశ్వర్, కోశాధికారి ధరావత్‌రవి, నల్గొండ నాగయ్య, బండి రవి, మోతిలాల్, బి.వి.చారి, సిద్ధులు, ఉమాశంకర్, మనోహర్, నరసింహరావు, తిరుపతి పాల్గొన్నారు.