
సమీకృత మార్కెట్‌ను వినియోగంలోకి తేవాలి
సూర్యాపేట : సమీకృత వెజ్– నాన్ వెజ్ మార్కెట్‌ను వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని సమీకృత మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. గాలి, వెలుతురు రావట్లేదని వ్యాపారస్తులు మార్కెట్‌ను వినియోగించటం లేదని, దానికి ప్రత్యామ్నాయంగా గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేసి క్రయవిక్రయాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. వచ్చే శనివారం మార్కెటింగ్ అధికారులతో, మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీఓ వేణు మాధవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ హన్మంతరెడ్డి, మార్కెట్ కార్యదర్శి మహమ్మద్ ఫసియొద్దీన్, మార్కెటింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్