మళ్లీ.. సిబ్బంది కొరత | - | Sakshi
Sakshi News home page

మళ్లీ.. సిబ్బంది కొరత

Sep 25 2025 7:00 AM | Updated on Sep 25 2025 7:00 AM

మళ్లీ.. సిబ్బంది కొరత

మళ్లీ.. సిబ్బంది కొరత

సేవలు అందుబాటులోకి వస్తున్న సమయంలో..

మున్సిపాలిటీ వార్డు రిలీవ్‌

ఆఫీసర్లు అయినవారు

తిరుమలగిరి (తుంగతుర్తి): మున్సిపాలిటీల్లో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. రెండేళ్ల నుంచి వార్డు ఆఫీసర్లుగా పని చేసిన వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు తిరిగి సొంతశాఖ అయిన రెవెన్యూకు వెళ్లి పోవడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 79 వార్డు ఆఫీసర్లకు గాను ఒకే సారి 66మంది రిలీవ్‌ అయ్యారు. దీంతో సేవలపై తీవ్ర ప్రభావం పడింది.

జీపీఓ పోస్టుల్లో అవకాశం కల్పించడంతో..

గత ప్రభుత్వ హయాంలో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏల వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. వారిని వివిధ శాఖల్లో నియమించింది. జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డు అసిస్టెంట్‌లుగా, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా సర్దుబాటు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ పాలన అధికారులుగా వ్యవస్థను తీసుక వచ్చింది. ఇందులో భాగంగా ప్రతి రెవెన్యూ కార్యాలయానికి ఒక జీపీఓను నియమించింది. జీపీఓ పోస్టుల్లో వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలకు తిరిగి అవకాశం కల్పించింది. అర్హత పరీక్ష నిర్వహించి ఎంపికై న వారిని తిరిగి గ్రామ పాలన అధికారులుగా నియామకం చేసింది. వార్డు ఆఫీసర్లలో ఎక్కువ మంది వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు ఉండటంతో వారంతా మాతృ శాఖ అయిన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లిపోయారు. దీంతో మున్సిపాలిటీల్లో పాలనా పరంగా మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి.

ఐదు మున్సిపాలిటీల్లో 66 మంది రిలీవ్‌

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో రెవెన్యూ శాఖ నుంచి వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు 79 మంది వార్డు ఆఫీసర్లుగా 2023 నుంచి పని చేస్తున్నారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనా అధికారులుగా నియమించడంతో ఐదు మున్సిపాలిటీల నుంచి 66 మంది ఒకే సారి రిలీవ్‌ అయ్యారు. కేవలం 13 మంది మాత్రమే మిగిలిపోయారు. దీంతో వార్డు ఆఫీసర్ల కొరత ఏర్పడింది. సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సిబ్బందిని నూతనంగా నియమించాలని కోరుతున్నారు.

ఫ రెవెన్యూ శాఖకు వెళ్లిన వార్డు ఆఫీసర్లు

ఫ ఐదు మున్సిపాలిటీల్లో విధుల నుంచి ఒకేసారి 66మంది రిలీవ్‌

ఫ మిగిలింది 13 మంది మాత్రమే..

ఫ సేవలపై తీవ్ర ప్రభావం

నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో 2018 సంవత్సరం నుంచి సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వార్డు ఆఫీసర్లుగా రెవెన్యూ సిబ్బంది నియామకమైన తరువాత వీరు ప్రతి రోజూ తమ వార్డుల్లో పర్యటిస్తూ ఆస్తి పన్ను వసూలు చేయడం, పారిశుద్ధ్యం, పచ్చదనం, ఇందిరమ్మ ఇళ్ల పర్యవేక్షణ తదితర పనులల్లో నిమగ్నమయ్యే వారు. ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో ప్రభుత్వం తిరిగి రెవెన్యూ వ్యవస్థను ప్రారంభించింది. గతంలో పని చేసిన వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకుంది. దీంతో మున్సిపాలిటీల్లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. వార్డు ఆఫీసర్లు ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారమయ్యేవని ప్రజలు చెబుతున్నారు.

సూర్యాపేట 14 11

కోదాడ 13 08

హుజూర్‌నగర్‌ 20 19

తిరుమలగిరి 17 12

నేరేడుచర్ల 15 14

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement