
భారీ వర్షంతో రాకపోకలు బంద్
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తిమ్మాపురం–సంగెం మధ్య కోడూరు వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో మళ్లీ రాకపోకలు బందయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇదే పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల పాటు వాహనాలు నిలిచిపోయి కోడూరు గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మళ్లీ భారీ వర్షానికి ఇదే పరిస్థితి నెలకొంది. కోడూరు–సంగెం మధ్య రెండు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కోడూరు గ్రామ ప్రజలు పండుగల వేళ ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కాగా అత్యవసరం ఉన్న వారిని గ్రామ పంచాయతీ ఆధ్వర్వంలో ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి వాగు దాటిస్తున్నారు. ఈ రహదారిపై వంతెనల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

భారీ వర్షంతో రాకపోకలు బంద్