
కబడ్డీ బాల బాలికల జట్ల ఎంపిక
కోదాడ: ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా మక్తల్‌లో జరిగే రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్స్ పోటీల్లో జిల్లా తరఫున ఆడే బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, నామ నర్సింహారావులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక చేసిన క్రీడాకారులకు శిక్షణ ఇచ్చామని, దీనిలో ప్రతిభ కనపరిచిన వారి నుంచి 14 మంది చొప్పున రెండుజట్లకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వారు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులకు వైష్ణవి స్కూల్ యాజమాన్యం క్రీడా దుస్తులను అందించింది.
బాలుర జట్టు: బి. వినయ్(సూర్యాపేట),వి. వరుణ్, గోపిచంద్ (నేరేడుచర్ల), బి. దుర్గాప్రసాద్ (జాన్‌పహాడ్), జి. సాయిరాం (పెన్‌పహాడ్), జె. ఆనంద్( హుజూర్‌నగర్), పి. శివ(అమరవరం), ఎన్. విష్ణు, ఆర్ దినేష్( నూతన్‌కల్), టి. వినయ్(మాధరాయినిగూడెం), జి. యగ్నేష్ (రంగాపురం), బి. వినయ్ (వెల్లటూరు), డి. మిధున్ (నడిగూడెం), నాగసేనరెడ్డి( చింతలపాలెం), కోచ్‌గా ఉదయ్‌కిరణ్, మేనేజర్‌గా మాధవరెడ్డిలను ఎంపిక చేశారు.
బాలికలజట్టు: ఎ. దివ్య( అప్పన్నపేట), వర్షిత, వైష్ణవి, రేవతి, దీక్షిత (నామవరం), ఎం. కీర్తిక(మేళ్లచెరువు), ఎల్. రాజశ్రీ ( గడ్డిపల్లి), ఎస్ శశిరేఖ (రాఘవాపురం), ఎస్.కె. అక్బరీ( కోదాడ), డి. శ్రీవల్లీ ( చివ్వెంల), ఎం. ఇందు (దూపహాడ్),కోచ్‌గా కోటేశ్వరావు, మేనేజర్‌గా లక్ష్మీరాజ్యంలను ఎంపిక చేసినట్లు వారు వివరించారు.