
మద్దతుకు మించి..
సూర్యాపేట : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా పెసళ్లకు బుధవారం రూ.9108 ధర పలికింది. ఈ వానాకాలం సీజన్‌లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం పెసళ్లకు రూ.8,768 మద్దతు ధర చెల్లిస్తుండగా.. దీనికి మించి ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం దాదాపు 61 మంది రైతులు 501 బస్తాలు (301 క్వింటాళ్లు) పెసళ్లను అమ్మకానికి తీసుకొచ్చారు. అత్యధికంగా రూ.9108, అత్యల్పంగా రూ.2786 ధర వచ్చింది. అత్యధిక ధర పలికిన పెసళ్లను తీసుకొచ్చిన పెన్‌పహాడ్ మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన మహిళా రైతు గుండు ఉమను మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి కలిసి అభినందించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి మంచి ధర పొందాలని సూచించారు. ఆయన వెంట మార్కెట్ సెక్రటరీ ఫసీయుద్దీన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ సూర్యాపేట మార్కెట్‌లో క్వింటా పెసళ్లకు రూ.9,108 పలికిన ధర