
వేతనాలు ఇప్పించాలని వినతి
సూర్యాపేట : ఐదు నెలలుగా జీతాలు లేకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత ఏజెన్సీ ద్వారా వేతనాలు ఇప్పించాలని కోరుతూ టీఎస్ వ్యాన్, వీడియో కాన్ఫరెన్స్ ఇంజినీర్లు .. అదనపు కలెక్టర్ సీతారామారావుకు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిబ్బందికి అయిదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభానికి లోనవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో జిల్లా ఇంజనీర్లు నవీన్ కుమార్, శ్రీను, ప్రేమానందం, వెంకట్, సైదులు, మధు, శంకర్, నగేష్ పాల్గొన్నారు.
ప్రభుత్వ నిర్ణయం
సరైంది కాదు
సూర్యాపేటటౌన్ : మౌలిక వసతులు లేని సర్కారు పాఠశాలలను నాలుగైదు కలిపి ఒకే సముదాయంలో నిర్వహించాలని తద్వారా ఉపాధ్యాయుల కొరత తీరుతుందని ప్రభుత్వం చేసే ఆలోచన సరైంది కాదని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. డీటీఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళవారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించి ప్రతి సంవత్సరం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలన్నారు. విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా ఉదయం అల్పాహారం, ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆర్.లింగయ్య, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు సీహెచ్.వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వేణు, వెంకటేశ్వర్లు, ఆనంద భాస్కర్, సీహెచ్.యాదగిరి, సింహాద్రి, దేవేందర్, కవిత పాల్గొన్నారు.
అకడమిక్ కౌన్సిలర్ల నియామకానికి దరఖాస్తులు
రామగిరి(నల్లగొండ) : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అకడమిక్ కౌన్సిలర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు నల్లగొండలోని ఎన్జీ కళాశాల రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోసు్ట్రగాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై, బోధన అనుభవం కలిగి ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.

వేతనాలు ఇప్పించాలని వినతి