
చోరీల నియంత్రణకు నిరంతర పెట్రోలింగ్
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలు, రోగులతో పాటు సేవలందిస్తున్న వైద్యాధికారులకు రక్షణ కల్పిస్తామని జిల్లా ఎస్పీ నర్సింహ చెప్పారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఎస్పీ సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారులు.. పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేయాలని, ఎలాంటి మెడికో లీగల్ కేసులు నమోదు అయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్న వసతులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసుపత్రి ప్రాంగణంలో గల పోలీస్ అవుట్ పోస్టును పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ ప్రసన్నకుమార్, సూర్యాపేట పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, వైద్యాధికారులు డాక్టర్ విజయ్ కుమార్, డా.వినయానంద్, డా.లక్ష్మణ్, డా.మనీషా, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
సూర్యాపేటటౌన్ : చోరీల నియంత్రణకు నిరంతం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా సెలవులకు ఎక్కువ రోజులు ఊర్లకు, దూరప్రాంతాలకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవీ.. ఎస్పీ సూచనలు
సెలవుల్లో బయటికి వెళ్తున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్‌ను ఏర్పాటు చేసుకోవడం మంచిది.
తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్‌లో లేదా మీగ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వాలి.
ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలి.
మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండి. వాటికి చైన్‌తో లాక్ వేయడం మంచిది.
నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్ మన్/ సెక్యూరిటీ గార్డ్/ సర్వెంట్ గా నియమించుకోవాలి.
సోషల్ మీడియాలో మీ లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే మీ అప్డేట్స్ పెట్టకండి.
ఫ ఎస్పీ నరసింహ