
వట్టిఖమ్మంపహాడ్‌లో ఉద్రిక్తత
సూర్యాపేట : చివ్వెంల మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలో మంగళవారం పీఎసీఎస్ కార్యాలయం వద్ద యూరియా పంపిణీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. లారీలో యూరియాలోడు రావడంతో పంపిణీ చేయాలని గ్రామస్తులు ఆందోళన చేస్తూ అడ్డుకున్నారు. తహసీల్దార్ ప్రకాశ్‌రావు అక్కడికి చేరుకుని రైతులకు సర్దిచెప్పి 80 మందికి అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తహసీల్దార్ చెప్పిన విధంగా కాకుండా 60 మందికి మాత్రమే టోకెన్లు ఇవ్వడంతో మహిళా రైతులు వ్యవసాయ అధికారితో వాగ్వాదానికి దిగారు. పీఎసీఎస్‌కు వచ్చిన లోడ్ యూరియాను దింపనివ్వకపోవడంతో ఎస్‌ఐకి ఏఓ సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని లారీలో ఉన్న యూరియాను దిగుమతి చేయించి, పీఎసీఎస్ కార్యాలయంలో ఉంచారు. బుధవారం పంపిణీ చేస్తామంటూ అధికారులు వెళ్లిపోయారు.

వట్టిఖమ్మంపహాడ్‌లో ఉద్రిక్తత