
ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వొద్దని ధర్నా
సూర్యాపేట : భవననిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతల మల్లయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులు రూ.346 కోట్లను ప్రైవేట్ కంపెనీకి బదలాయించడం అన్యాయమన్నారు. అనంతరం లేబర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలక సోమయ్య గౌడ్, కొత్తపల్లి శివకృష్ణ, మల్లెపాక నగేష్, బాలాజీ, నాగలక్ష్మి, రాజు, రంగయ్య, లింగయ్య, మహేష్, జలంధర్ పాల్గొన్నారు.