
సామాజిక సేవలకు గుర్తింపుగా పురస్కారం
మూసీ ఉధృతం
మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణానికి చెందిన పోచం కన్నయ్య మదర్ థెరిస్సా జాతీయ స్ఫూర్తి సేవా పురస్కారం అందుకున్నారు. కన్నయ్య నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి వసుంధర విజ్ఞాన వికాస మండలి వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయనను పురస్కారానికి ఎంపిక చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి చేతుల మీదుగా పురస్కారం ప్రదానం చేశారు.

సామాజిక సేవలకు గుర్తింపుగా పురస్కారం