
మట్టపల్లిలో ముగిసిన పవిత్రోత్సవాలు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పవిత్రోత్సవాలు మహాశాంతి కల్యాణంతో సోమవారం ముగిశాయి. ఈసందర్భంగా యాజ్ఞీకులు బొర్రా వెంకటవాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో అగ్ని ఆరాధనలు, హోమం, పూర్ణాహుతి, పవిత్రాల విసర్జనోత్సవ, సప్తదశకుంభారోపణం, మహాశాంతి కల్యాణం, ఆచార్యసన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నీరాజనమంత్రపుష్పాలతో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ నవీన్, అర్చకులు శ్రీనివాసా చార్యులు, కృష్ణమాచార్యులు, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, బ్రహ్మాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

మట్టపల్లిలో ముగిసిన పవిత్రోత్సవాలు