
హోంగార్డుల సంక్షేమానికి పాటుపడతా
సూర్యాపేటటౌన్ : హోంగార్డుల సంక్షేమానికి పాటుపడతానని ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్‌లను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డులకు ఎస్పీ అందజేసి మాట్లాడారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోం గార్డులు పోలీస్ శాఖలో అంతర్భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలు అందిస్తున్నారన్నారు. వర్షాకాలం, చలికాలంలో హోంగార్డులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించేందుకు ఉలెన్ జాకెట్స్, రెయిన్ కోట్స్ అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డుల రాష్ట్ర కమాండెంట్ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఆర్‌ఐ నారాయణరాజు, ఆర్‌ఎస్‌ఐ అశోక్ పాల్గొన్నారు.
బాధితులకు అండగా ఉంటాం
శాంతిభద్రతల పరిక్షణలో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకు అంటామని జిల్లా ఎస్పీ కె.నరసింహ పేర్కొన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారితో మాట్లాడి ఫిర్యాదులను పరిశీలించి మాట్లాడారు. ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712686057కు ఫోన్ చేసి పోలీసుల సేవలు పొందాలన్నారు.
ఎస్పీ నరసింహ